Tuesday 24 October 2017

నిలిచిపోయిన ఓలా, ఉబెర్‌ సర్వీసులు

హైదరాబాద్‌లో ఉబర్, ఓలా క్యాబ్‌ సర్వీసులు నిలిచిపోయాయి. ఫైనాన్సర్ల వేధింపులు, క్యాబ్‌ డ్రైవర్‌ల వరుస ఆత్మహత్యల నేపథ్యంలో ఈ బంద్‌ను పాటిస్తున్నట్టు తెలంగాణ క్యాబ్‌ డ్రైవర్స్‌ అండ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ తెలిపారు. క్యాబ్‌ డ్రైవర్లు తమ సమస్యలపై పలుమార్లు తాము ఆందోళన చేపట్టినా ప్రభుత్వం స్పందించడంలేదని అసోసియేషన్‌ అధ్యక్షుడు విమర్శించారు.
దీంతో నగరంలో క్యాబ్‌ సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక మరోవైపు తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అసోషియేషన్‌ అధ్యక్షుడు హెచ్చరించారు. లక్షన్నర కార్లు ఈ రెండు సంస్థల్లో తిరుగుతున్నాయని, రూ.లక్షలు అప్పులు తెచ్చి కార్లు కొనుక్కున్న ఎంతోమందికి కనీస ఉపాధి లభించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

money management

SALE BESTSELLER NO. 1 The Total Money Makeover: Classic Edition: A Proven Plan for Financial Fitness If you will live like no one el...